Telangana Rains Today : తెలంగాణలో చిరుజల్లులు.. నేడు, రేపు మోస్తరు వర్షాలు - Telangana Rains Today
Published : Sep 22, 2023, 9:16 AM IST
Telangana Rains Today :బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గత అర్ధరాత్రి నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని ఖైరతాబాద్, బోరబండ, అమీర్పేట్, కుత్బుల్లాపూర్, అంబర్పేట్, పంజాగుట్ట, హియాయత్నగర్, నారాయణగూడ, ముషీరాబాద్, రాంనగర్, అడిక్మెట్, సికింద్రాబాద్, సనత్నగర్, కాప్రా, ఈసీఐఎల్, సైనిక్పురీ, మల్కాజ్గిరి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమైపోయాయి.
Hyderabad Rains Today :ఏకధాటి వానతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ద్విచక్రవాహనాలు ముందుకు కదలడం ఇబ్బందికరంగా మారిపోయింది. దీంతో రాత్రి వేళ ఇళ్లకు వెళుతున్న వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. రోడ్లపై నీళ్లు నిలిచి ఉండడంతో ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ రోడ్డు ఉందో తెలియక నెమ్మదిగా వెళుతున్నామని వాహనదారులు పేర్కొంటున్నారు. నగరంలో వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోత్తట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.