Telangana Rains : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ - imd forecast
Published : Sep 5, 2023, 7:21 PM IST
Telangana Rains IMD Forecast : రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కొనసాగనున్నాయి.. మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయని తెలిపింది. తెలంగాణలో ఇవాళ ఆరెంజ్.. బుధవారం, గురువారం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Weather Report : ఇప్పటి వరకు రాజన్న సిరిసిల్లా, నిజామాబాద్ జిల్లాలో 60 శాతం పైగా వర్షపాతం నమోదైయిందని పేర్కొంది. ఉత్తర వాయువ్య జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిశాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడిన అల్ప పీడనం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వెళ్లనుందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మోస్తారు వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులు గురించి మరిన్ని డైరెక్ట్ నాగరత్న మాటల్లో తెలుసుకుందాం.