PRATHIDHWANI ఐటీ ఉద్యోగ ఆశావహుల్లో అయోమయం జాబులు ఉన్నట్టా లేనట్టా - Prathidhawani debate
ఐటీ జాబులు ఆఫర్ ఉన్నట్టా, లేనట్టా కొద్దిరోజులుగా ఐటీఉద్యోగాల ఆశావహుల్లో ఇదే డోలాయమానం. రోజుకో వార్త బయటకు వస్తోంది. ఒక నివేదిక ఇండస్ట్రీ పరిస్థితి ఏం బాలేదు అంటోంది. మరో నివేదిక ఆఫర్ లెటర్లు మొత్తానికి వెనక్కు తీసుకుంటున్నారని చెబుతోంది. ఇంకొక దానిలో ఇప్పటికే ఆఫర్ లెటర్లు పొందిన వారి వడబోతకు కంపెనీలు మళ్లీ ఇంటర్వ్యూలు చేపట్టనున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి? గతంలో ఎప్పుడూ లేనంతగా... ఆఫర్ లెటర్లు పొందిన తర్వాత ఫ్రెషర్లు కొలువుల కబురు కోసం ఎందుకు ఎదురు చూడాల్సి వస్తోంది? మాంద్యం ప్రభావమే నిజమైతే తిరిగి సాధారణ పరిస్థితులు ఎప్పటికి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST