అధిష్ఠానం అవకాశమిస్తే కామారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తా: అజహరుద్దీన్ - అవకాశం ఇస్తే కామారెడ్డిలో పోటీ చేస్తా
Azaharuddin comments in Kamareddy: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధిష్ఠానం అవకాశమిస్తే రాబోయే శాసన సభ ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం పార్టీ నేతలతో కాసేపు మాట్లాడి జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. పర్యటనలో భాగంగా లింగంపేటలో అజహరుద్దీన్ సమక్షంలో పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన అజహరుద్దీన్ వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని అన్నారు. ఆయన పర్యటనలో పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.
"కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. కామారెడ్డిలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఒకవేళ అధిష్ఠానం అవకాశం ఇస్తానంటే ఎన్నికల్లో పోటీ చేస్తా."- అజహరుద్ధీన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్