తెలంగాణ

telangana

telangana jana samithi formation day

ETV Bharat / videos

TJS Formation day: అమరుల ఆశయ సాధనే.. 'తెలంగాణ జన సమితి' లక్ష్యం - హైదరాబాద్ న్యూస్

By

Published : Apr 29, 2023, 3:16 PM IST

Telangana Jana Samithi Fifth Inauguration Celebrations: రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమర వీరుల ఆశయాలు సాధించడమే తెలంగాణ జన సమితి లక్ష్యమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య కోదండాం తెలిపారు. తెలంగాణ జన సమితి ఐదో ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు. అవినీతిమయ ప్రభుత్వంలో ప్రజలు ఆవేదన పడుతున్నారని విమర్శించారు. అనేక గ్రామాల్లో ఇప్పటికీ పంట నష్టంపై అధికారులు సర్వే చేయలేదని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే కమీషన్లు తీసుకున్నారని ముఖ్యమంత్రి చెప్పటం సిగ్గుచేటని పార్టీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీజేఎస్​ పార్టీ నాయకులు కలసిన ప్రతి రైతు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. రైతులు వర్షాలు వల్ల వారి పంటలు కోల్పోతుంటే.. ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు. దీంతో అన్నదాతలు ఎలా బతకాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్​ పార్టీ ప్రముఖ నేతలు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details