Telangana High Court Shock TO Gadwala MLA : "డీకే అరుణ టూరిస్టు నాయకురాలు.. నేను ప్రజల మనిషిని" - గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటర్వ్యూ
Published : Aug 24, 2023, 6:56 PM IST
Telangana High Court Shock TO Gadwala MLA : శాసనసభ ఎన్నికకు ఇంకా మూడు నెలలే గడువు ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఎన్నికల అఫిడవిట్లు తప్పుగా నమోదు చేశారని హైకోర్టు ముందు ఎన్నికలో గెలుపొందిన ఎన్నిక చెల్లదని చెపుతుంది. ఈ క్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికపై హైకోర్టు తీర్పును ఇచ్చింది. 2018 శాసనసభ ఎన్నికలో కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని.. అప్పుడు పోటీ చేసిన సమీప ప్రత్యర్థి డీకే అరుణ ఎమ్మెల్యేగా గెలుపొందారని హైకోర్టు తెలిపింది. 2024 శాసనసభ ఎన్నికకు కూడా సీఎం కేసీఆర్ 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో గద్వాల నుంచి మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డినే బరిలోకి దించుతున్నారు. ఎన్నికకు సంబంధించి అసలు ఈ వివాదం ఏంటి? ప్రస్తుతం రాబోతున్న ఎన్నికల్లో ఈ తీర్పు ఎంత వరకు ఆయనకు నష్టం కలిగిస్తుంది. హైకోర్టు తీర్పుపై అసలు ఎలా ముందుకు పోతారనే విషయంపై ప్రస్తుతం గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డితో ఈటీవీ/ఈటీవీ భారత్ ముఖాముఖి.