PRATHIDWANI: రైతులకు తక్షణం సహాయం అందాలంటే ఏం చేయాలి? - రైతులకు తక్షణ సాయం అందుతుందా
PRATHIDWANI: విపత్తులతో పంట నష్టపోయే రైతులు.. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడక తప్పడం లేదు. ఏటా దాదాపుగా ఇదే పరిస్థితి. ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం కేసీఆర్.. ఎకరాకు రూ. 10వేలు సాయం చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. అయితే.. సీఎం లేదా మంత్రులు నేరుగా చూసినా, చూడకపోయినా.. పంట నష్టపోయిన రైతులు తమ హక్కుగా పరిహారం పొందాలంటే ఏం చేయాలి? పంట పరిహార విధానాల్లో లోపాలు ఏ విధంగా సరిదిద్దాలి? ప్రైవేటు అప్పుల ఊబిలో చిక్కి ఆగమవుతున్న వారి కష్టాలు తీరేదెలా? ఇన్‌పుట్ సబ్సిడీల నుంచి పంటనష్ట పరిహారం వరకు.. రైతులకు తక్షణం సహాయం అందాలంటే ఏం చేయాలి? పంటల బీమాను పక్కాగా అమలు చేయడం ఎలా? పంటనష్టానికి హక్కుగా పరిహారం ఇవ్వడమెలా? పంట పరిహార విధానాల్లో లోపాలెలా సరిదిద్దాలి? ప్రభుత్వం ఏం చేస్తే.. రైతుల అగచాట్లు తీరే అవకాశం ఉందన్న అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ.