తెలంగాణ

telangana

Telangana Governor Tamilisai Soundararajan visits to AP

ETV Bharat / videos

Telangana Governor Tamilisai Soundararajan AP Tour తెలంగాణ గవర్నర్ ఏపీకి వచ్చిన వేళ.. ఉద్రిక్తత, అరెస్టులు! - ఏపీలో తమిళసై

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 4:11 PM IST

Updated : Sep 2, 2023, 6:52 PM IST

 Telangana Governor Tamilisai Soundararajan visits to AP: ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి (Governor Tamilisai Soundara Rajan) గన్నవరం విమానాశ్రయంలో కలెక్టర్ రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరి వెళ్లారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న గవర్నర్‌ తమిళిసైకి దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న తమిళసైకి పండితులు వేదాశీర్వచనం అందించారు. చంద్రయాన్ 3 విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఆదిత్య-వన్ విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు తెలంగాణ గవర్నర్‌ తమిళసై తెలిపారు.

వర్నర్‌ వస్తేనే గుంతలు పూడ్చుతారా?:   ఇది ఇలా ఉంటే,  తెలంగాణ గవర్నర్ తమిళిసై రాక.. స్థానిక గుంటూరు మంగళగిరిలో రాజకీయ దుమారాన్ని రేపింది. తమిళసై రానున్నారన్న సమాచారంతో.. రాత్రికి రాత్రే ఆమె ప్రయాణించే రహదారుల్లో గుంతలను పూడ్చేందుకు అధికారులు సిద్దమైయ్యారు.  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక అధికారులు రాత్రి కంకరతో గుంతలు పూడ్చారని మంగళగిరి మండలం కురగల్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  కురగల్లు వైపుగా  తెలంగాణ గవర్నర్ వస్తుందన్న విషయం తెలుసుకున్న స్థానిక  యువకులు  తమ ప్రాంతంలోని  రహదారుల దుస్థితిని తెలియజేస్తూ కురగల్లు గ్రామస్థుల ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.  గవర్నర్‌ వస్తేనే గుంతలు పూడ్చుతారా  అంటూ ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు. దీంతో ఫ్లెక్సీ పెట్టిన యువకులను పోలీసులు  అరెస్ట్​ చేశారు.  

Last Updated : Sep 2, 2023, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details