Government Rice Mills in Telangana : ప్రభుత్వ ఆధ్వర్యంలో రైస్ మిల్లులు.. ఇకనైనా రైతు లబ్దిపొందేనా..! - రైస్‌బ్రాన్ ఆయిల్
Telangana Civil Supplies Department Latest News : ధాన్యాన్ని బియ్యంతోపాటు నూనె వంటి పలురకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానానికి చేరుకున్న తెలంగాణ రైతులు తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లో విక్రయించి లాభాలు ఆర్జించే స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైస్‌మిల్లులు ఏర్పాటు చేసి, నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో వరిధాన్యం నుంచి తయారు చేసే పలురకాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ మేరకు మార్కెట్ విస్తరించే బాధ్యతను కార్పొరేషన్ నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కానుకగా రైతుల చెంతకే రైస్ మిల్లులు చేరి, పంటకు మరింత గిరాకీ పెంచేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. సోమవారమిక్కడ సచివాలయంలో వరిధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచ ప్రఖ్యాత జపాన్‌కు చెందిన రైస్‌మిల్ కంపెనీ సటేక్ కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు అమలవుతోంది... ఇందులో సవాళ్లేమిటి.. ఈ అంశాలపై ఇవాళ్టి ప్రతిధ్వని...