special lighting at Govt Offices : విద్యుత్ వెలుగుల్లో ప్రభుత్వ కార్యాలయాలు - ప్రభుత్వ కార్యాలయాల్లో లైటింగ్
special lighting at Govt Offices in Hyderabad :తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 2 తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్య కార్యాలయాలు, టూరిజం, హోటల్స్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, బుద్ద విగ్రహం తదితర పరిసరాలు ప్రత్యేక విద్యుత్ కాంతులతో ధగధగ మెరిసిపోతున్నాయి. మిలమిల మెరిసే కాంతుల్లో.. చూడముచ్చటైన రంగుల్లో సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. సచివాలయం ముందు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను రంగు రంగులుగా చూడ ముచ్చటగా అలంకరించడంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. బుద్ధుని విగ్రహం, బోట్లు, ట్యాంక్ బండ్ చుట్టూ అమర్చిన రంగుల రంగుల అందాలను రెట్టింపు చేస్తున్నాయి.