తెలంగాణ

telangana

Telangana Decade Celebrations

ETV Bharat / videos

Telangana Formation Day celebrations 2023 : సర్వాంగ సుందరగా హైదరాబాద్.. విద్యుత్‌ దీపాలతో ధగధగ - Hyderabad ready to Telangana Decade celebrations

By

Published : Jun 1, 2023, 10:42 PM IST

Telangana Decade Celebrations : దశాబ్ది వేడుకలకు తెలంగాణ సిద్ధమైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ సర్వాంగ  సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాలనా సౌధంలో తొలిసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్‌ దీపాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు. నూతన సచివాలయం, అమరవీరుల స్మారక స్తూపం, అసెంబ్లీ, గన్‌పార్క్‌ కూడళ్లు, నిజాం కళాశాల పరిసరాలు.. విద్యుత్ దీపకాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. 

హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలంకరణతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌ కాంతులతో ధగధగ లాడుతూ శోభాయమానంగా నిలిచాయి. మిలమిల మెరిసే కాంతుల్లో.. చూడముచ్చటైన రంగుల్లో సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర సచివాలయంలో వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రగతిని చాటి చెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు. అన్ని వర్గాల ప్రజలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల లబ్దిదారులను భాగస్వామ్యుల్ని చేస్తూ 21 రోజులపాటు ఈ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 

ABOUT THE AUTHOR

...view details