తెలంగాణ

telangana

అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన సెక్రటేరియట్

ETV Bharat / videos

TS Formation Day Arrangements : దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన సచివాలయం - Telangana formation Day arrangements

By

Published : Jun 1, 2023, 10:25 AM IST

Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది వేడుకలకు నూతన సచివాలయం అత్యంత సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాలనా సౌధంలో తొలిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలకు నూతన సెక్రటేరియట్​ను దేదీప్యమానంగా తీర్చిదిద్దింది. విద్యుత్ దీపాలంకరణతో వెలుగులీనుతున్న సెక్రటేరియట్ చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలంకరణతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. 

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అంబేడ్కర్ సచివాలయం, అమరవీరుల స్మారక స్థూపం విద్యుత్‌ కాంతులతో ధగధగ మెరిసిపోతున్నాయి. మిలమిల మెరిసే కాంతుల్లో.. చూడముచ్చటైన రంగుల్లో సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. రాష్ట్ర సచివాలయంలో వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రగతిని చాటి చెప్పేలా రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శించనున్నారు. 21 రోజుల పాటు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం జరపనున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details