Telangana Decade Day Celebrations 2023 : కళ్లు తిప్పనివ్వని లేజర్ షో.. 10 నిమిషాల సినిమా అదుర్స్ - దుర్గం చెరువు వద్ద లేజర్ షో
Telangana Decade Day Celebrations Laser Show In Hyderabad : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 3వ తేదీన రైతు దినోత్సవం జరుపుకున్న ప్రజానికం. జూన్ 4న సురక్షా దినోత్సవం జరుపుతున్నారు. ఈ వేడుకలో భాగంగా సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర లేజర్, త్రీడీ షోను ప్రదర్శించారు. ఆ లేజర్ షోలో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుపుతూ.. వాటి ఆకృతులను ప్రదర్శించారు. మొదటగా దశాబ్ది ఉత్సవాల లోగోను చూపుతూ.. ఆ తర్వాత తెలంగాణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరు స్తూపాన్ని ఏర్పాటు చేశారు. దానిని లేజర్లో చూపించారు.
భారతదేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం, తెలంగాణ శ్వేతసౌధం, కాళేశ్వరం ప్రాజెక్టు, వేముల వాడ మల్లన్న స్వామి, సీఎం కేసీఆర్, టీహబ్, పోలీసుల లోగో, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం, సైబరాబాద్ పోలీస్ లోగో, షీ టీమ్స్ లోగో.. ఆఖరికి జై తెలంగాణ జై భారత్ అనే నినాదంతో లేజర్ ముగిసింది. ఈ లేజర్ షోను తిలకించడానికి ఎంతో మంది జనం అక్కడకు విచ్చేశారు. ఆ షోను చూసి అందరూ ఆనందం, ఆశ్చర్యంతో కరతాల ధ్వనులతో తెలంగాణ వేడుకలను జరుపుకున్నారు.