Telangana Congress MLA Tickets War : దిల్లీకి చేరిన కాంగ్రెస్ టికెట్ల వార్.. ప్లకార్డులు పట్టుకొని నిరసనలు - దిల్లీలో కాంగ్రెస్ లీడర్స్ ధర్నా
Published : Oct 8, 2023, 8:00 PM IST
Telangana Congress MLA Tickets War : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్‌ల గొడవ రోజురోజుకి తారస్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న(Telangana Congress) ఆశావహులు తమ నిరసన గళాన్ని పెంచారు. ఇప్పటికే చాలా మంది నేతలు దిల్లీ చేరుకుని అభ్యర్థితత్వం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీట్ల కోసం వారిలోనే వారు గొడవలు పడిన దృశ్యాలు చాలానే ఉన్నాయి. ఇటు తెలంగాణలోనూ.. అటు దిల్లీలోనూ రోజూ ఎమ్మెల్యే టికెట్ కోసం పోరుబాట పడుతున్నారు.
ఈ క్రమంలో సీట్ల ఎంపిక కసరత్తు జరుగుతున్న వార్ రూమ్ ముందు ఓయూ విద్యార్థి ఐకాస నాయకులు ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ జిందాబాద్.. సోనియా గాంధీ జిందాబాద్.. ప్రియాంక గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ సూచనలు మేరకు స్క్రీనింగ్ కమిటీ పరిగణనలోకి తీసుకొని.. ఎన్నికల్లో తమకు సీటు కేటాయించాలని.. ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు.