తెలంగాణ

telangana

Elections

ETV Bharat / videos

Telangana CEO Vikas raj interview: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న ఈసీ - సీఈఓ వికాస్ రాజ్​ ముఖాముఖి

By

Published : Jun 6, 2023, 10:37 AM IST

Updated : Jun 6, 2023, 10:57 AM IST

Telangana CEO Vikas raj interview : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు షురూ చేసింది. ఎన్నికల ఏర్పాట్లలో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. ఈ ఏడాది ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. గత శాసనసభ ఎన్నికల తేదీనే ప్రామాణికంగా చేసుకొని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశాల మేరకు సన్నాహకాలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికలు ఎపుడు నిర్వహించేది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సన్నాహకాల్లో భాగంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఈవీఎంలు సిద్ధం చేయడం, అధికారులకు శిక్షణా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో తరచూ సంప్రందింపులు జరుపుతూ ఇబ్బందులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటరు నమోదు, ఇతర అంశాలకు సంబంధించి రేపు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు సీఈఓ వికాస్ రాజ్ ఈటీవీ ముఖాముఖిలో పేర్కొన్నారు

Last Updated : Jun 6, 2023, 10:57 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details