తెలంగాణ

telangana

Telangana Bonalu Festival 2023

ETV Bharat / videos

Prathidwani : ఆషాఢ బోనాలు.. ఈ విషయాలు మీకు తెలుసా? - Bonalu history

By

Published : Jul 8, 2023, 9:40 PM IST

Prathidwani : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం.. బోనం. ఆషాఢం వచ్చిందంటే ఊరూరా సందడి మొదలవుతుంది. స్థానికుల కట్టూబొట్టు, వేషభాషలను ప్రతిబింబిస్తుంది.. ఐక్యతను చాటుతుంది ఈ కోలాహలం. డప్పుచప్పుళ్లు.. హుషారెత్తించే నృత్యాలు.. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలతో యువత సందడి హోరెత్తుతుంది. నెత్తిన బోనం కుండతో ఆడపడుచులు అమ్మవారిని తలపిస్తారు. ఎన్నో విశిష్టతలు, మరెన్నో ప్రత్యేకతలు కలిగిన బోనాల పండుగ ఆషాఢ మాసంలో సామూహికంగా నిర్వహిస్తుంటారు. గ్రామ దేవతల ఆలయాలు భక్త జనరంజకంగా మారుతాయి. ప్రతి వీధిలోనూ లైటింగ్​తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఈ పండుగను చేసుకుంటారు. ప్రస్తుతం భాగ్యనగరం అంతటా ఇదే కనిపిస్తోంది. ఈ పండుగ చారిత్రక వైభవం, నేపథ్యాలు ఏమిటి? పండుగ నిర్వహించే విధానం ఏమిటి? ఎన్ని రోజులు ఈ పండుగ జరుగుతుంది? మొదట ఏ ప్రదేశంలో ప్రారంభమవుతుంది? ఘనంగా నిర్వహించే ఈ పండుగ ఎందుకు అంత స్పెషల్​? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details