Telangana Assembly Elections Result Live 2023 : హైదరాబాద్ చేరుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గచ్చిబౌలి హోటల్‌లో మకాం - తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం 2023
Published : Dec 3, 2023, 8:12 PM IST
Telangana Assembly Elections Result Live 2023 : రాష్ట్రంలో అత్యధిక స్థానాలల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎమ్మెల్యేలను హైదరాబాద్ రావాల్సిందిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ రాత్రికి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఎమ్మెల్యేలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్రావ్ ఠాక్రేతో పాటు ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, కే.జె.జ్యార్జ్, మురళీదరన్, అజయ్‌కుమార్, దీపాదాస్ మున్సీలు సమావేశమవుతారు.
Congress Government Formation Arrangements : ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు తీసుకుంటారు. ఆ అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానానికి నివేదిస్తారు. అధిష్ఠానం ఆమోదం లభించగానే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని ఎమ్మెల్యేల అభిప్రాయాలను అందచేసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్‌ను ఇవాళ రాత్రికికాని, రేపు ఉదయం కాని కలిసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.