ఎవరికి వారే గెలుపు ధీమాలు - మాకు రాబోయే స్థానాలు ఇన్ని అంటూ ఢంకా భజాయింపు - గెలుపు ధీమాతో బీఆర్ఎస్ పార్టీ
Published : Nov 23, 2023, 9:40 PM IST
|Updated : Nov 24, 2023, 6:11 AM IST
Telangana Assembly Elections Prathidwani : రాష్ట్రంలో ఆఖరిదశకు చేరిన ఎన్నికల వాతావరణం ఎంతో ఆసక్తి రేపుతున్నాయి.. అంతిమ సమీకరణాలు. ఎవరికి వారే గెలుపు ధీమాలు వ్యక్తం చేయడమే కాదు.. మాకు రాబోయి స్థానాలు ఇన్ని అంటూ ఢంకా భజాయించి చెబుతున్నారు. 70 నుంచి 82 స్థానాలతో మళ్లీ అధికారం మాదే అంటున్నారు మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. 80 స్థానాలకు తగ్గితే ఏ శిక్షకైనా సిద్ధమే అంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. అయితే తెలంగాణ అసెంబ్లీ స్థానాలు ఉన్నవి చూస్తే 119 మాత్రమే.. మరి ఈ అంకెల వెనక పార్టీల ధీమాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 80 స్థానాలు తగ్గితే ఏ శిక్షకైనా సిద్ధం అంటున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. అంత ధీమాగా ఎలా చెప్పగలిగారు? బీఆర్ఎస్ దాదాపుగా సిట్టింగ్‌లకే టిక్కెట్లు ఇవ్వడం మీకు కలసివచ్చే అంశంగా భావిస్తున్నారా? ఏ ఎన్నికలైనా వరసగా గెలుస్తున్న సిట్టింగ్‌లపై ఎంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్‌లపై వ్యతిరేకతను అధిగమించడానికి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు?