ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్ల బాట పట్టిన జనం
Published : Nov 30, 2023, 2:53 PM IST
Telangana Assembly Elections Polling 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజాస్వామ్యానికి పండుగలా భావించే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూళ్లకు జనం పెద్దఎత్తున కదులుతున్నారు. ఉపాధి, ఉద్యోగాలు, చదువుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా సొంతూళ్లలో ఓటేసేందుకు తరలి వెళ్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్షల్లో ఉన్న వలస ఓటర్లు.. వారి వారి ఊళ్లలో పోలింగ్ కేంద్రాల బాట పట్టారు.
వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం తరలివస్తుండగా.. రవాణా సౌకర్యం సరిగా లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. గంటలు తరబడి బస్టాండ్ల వద్ద వేచి చూస్తున్నారు. అందులోనూ తొలిసారి ఓటు వేయనున్న యువతైతే నూతన ఉత్తేజంతో ఓటు వేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని వివరించారు. తమ మొదటి ఓటు వినియోగం.. భవిష్యత్ నాయకుడిను ఎన్నుకోవటంపై తమదైన పాత్ర వహిస్తున్నట్లు కొందరు ఆలోచనలు పంచుకున్నారు. మరికొందరైతే ఎంత ప్రయాసపడైనా.. అయిదేళ్లకొచ్చే ఓట్ల పండుగలో తప్పనిసరిగా పాల్గొనాలంటూ బదులిచ్చారు.