Prathidwani : రాష్ట్రంలో హీట్ పెంచిన అసెంబ్లీ ఎన్నికలు.. పార్టీల ప్రాధాన్యాలు ఏంటి?
Published : Oct 26, 2023, 10:20 PM IST
Prathidwani : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు తమ అస్తిత్వాన్ని ప్రజల్లో బలంగా చాటుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. మేనిఫెస్టోలు, ఇతర హామీల రూపంలో ప్రజల ముందు తామేంటో, తమ విధానాలు ఏంటో బలంగా చాటి చెప్పేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ చూస్తుండగా.. ఆ బీఆర్ఎస్ను కొట్టి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఈ మూడు ప్రధాన పార్టీలు ప్రజల ముందుకు వెళ్లాయి. తాము ప్రకటించిన హామీలతో ముందుకు వెళుతూ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు.
రాష్ట్రంలో ప్రధాన పార్టీల ప్రాధాన్యాలు ఏమిటి? అధికారం చేపడితే ప్రజలకు ఏ పార్టీ ఏం చేయబోతోంది? ఇకపై ప్రధానపార్టీల ప్రచార వ్యూహాలెలా ఉండబోతున్నాయి? వారికే ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెబుతాయి? ఆయా పార్టీల అజెండాలు ఎలా ఉన్నాయి..? ఏయే అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.