రైలు పట్టాలపై అడ్డంగా పడుకున్న వృద్ధుడు.. చాకచక్యంగా కాపాడిన లోకో ఇన్స్పెక్టర్ - రైలు పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధుడు
ఆత్మహత్యకు ప్రయత్నించిన 65 ఏళ్ల వృద్ధుడిని కాపాడాడు ఓ లోకో ఇన్స్పెక్టర్. పట్టాలపై పడుకున్న వృద్ధుడిని గమనించిన లోకో ఇన్స్స్సెక్టర్.. చాకచక్యంగా రైలును ఆపి వృద్ధుడిని రక్షించాడు. దూరం నుంచే వృద్ధుడిని చూసి రైలు స్పీడ్ తగ్గించుకుంటూ వచ్చిన ఇన్స్పెక్టర్.. వృద్ధుడి దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా ఆపాడు. బంగాల్లో ఈ ఘటన జరిగింది.
ఆదివారం అలీపుర్దౌర్ రైల్వే డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రోహిత్ సర్కార్ అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవాలని న్యూ దోమోహని రైల్వే పోస్ట్ నెం. 43/24 సమీపంలో రైలు పట్టాలపై పడుకున్నాడు. దీన్ని రైలు లోకోపైలట్, ఇన్స్పెక్టర్ గమించారు. వెంటనే రైలును ఆపి ఆ వ్యక్తి కాపాడారు. కాగా తీవ్ర ఒత్తిడితోనే ఆ వృద్ధుడు చనిపోవాలనుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఎలాంటి పని దొరకపోవడం వల్లే తీవ్ర మనస్థాపానికి గురైనట్లు రోహిత్ సర్కార్ తెలిపారు. ఘటనపై అలీపుర్దార్ రైల్వే డివిజన్ డీఆర్ఎమ్ దిలీప్ సింగ్ స్పందించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సిబ్బందిని ఆయన అభినందించారు. కేవలం సిబ్బంది అవగాహనతోనే ఇలాంటి మంచి పనులు జరుగుతాయని వెల్లడించారు.