తెలంగాణ

telangana

స్కూల్​ యూనిఫామ్​లో క్లాస్​లు చెబుతున్న టీచర్​

ETV Bharat / videos

స్కూల్​​ యూనిఫామ్​లో టీచర్​.. పిల్లల్లో కలిసిపోయి, ఆటపాటలతో పాఠాలు - యూనిఫాం ధరించి పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు పాఠాలు

By

Published : Aug 10, 2023, 2:54 PM IST

Teacher Tells Classes in School Uniform :స్కూల్​ యూనిఫామ్​ ధరించి వినూత్నంగా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు ఓ ​ఉపాధ్యాయురాలు​. పిల్లల్ని ఆకట్టుకునేలా విద్యా బోధనలు చేస్తూ.. చదువుల పట్ల వారిలో ఆసక్తిని పెంచుతున్నారు. విద్యార్థులతో మమేకమై.. వారితో స్నేహంగా మెలుగుతూ నిత్యం పాఠశాలకు వచ్చేలా పొత్సహిస్తున్నారు. ఆమెనే ఛత్తీస్​గఢ్​కు చెందిన టీచర్​ జాహ్నవి యదు.

రాయ్​పుర్​ జిల్లాలోని రాంనగర్​ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు జాహ్నవి. పాఠాలు చెబుతూనే.. వీలున్నప్పుడు పిల్లలతో కలిసి ఆటలు కూడా ఆడతారు. అందుకే విద్యార్థులు తమ వ్యక్తిగత విషయాల్నీ జాహ్నవితో చెప్పుకుంటుంటారు. ఈ బడితో తనకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉందని.. అందుకే యూనిఫామ్​లో​ వచ్చేందుకు ఎటువంటి మొహమాటం లేదని అన్నారు జాహ్నవి.

"మొదట్లో పిల్లలు కాస్త అపరిశుభ్రంగా తరగతులకు వచ్చేవారు. షర్ట్​లకు బటన్లు​ ఉండేవి కావు. పూర్తి యూనిఫామ్​లో వచ్చేవారు కాదు. చాలా సార్లు చెప్పి చూశాను. అయినా వారు వినలేదు. అందుకే నేనూ యూనిఫామ్​​ వేసుకుని వస్తున్నాను. ఈ సంవత్సరం నుంచే ఇలా యూనిఫామ్​లో స్కూల్​కు వస్తున్నాను"

-టీచర్​ జాహ్నవి యదు

జాహ్నవి బోధన విధానం నచ్చి.. విద్యార్థులు కూడా ఎంతో ఆసక్తిగా పాఠాలు వింటున్నారు. నిర్భయంగా టీచర్​ను సందేహాలు అడుగుతూ.. ప్రతి విషయాన్ని సులభంగా నేర్చుకుంటున్నారు. పిల్లలతో మమేకమై, కొత్తగా పాఠాలు చెబుతున్న టీచర్​ జాహ్నవిని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details