ETV Bharat Telangana

తెలంగాణ

telangana

video thumbnail
Teacher Slapped Student 35 Times

ETV Bharat / videos

Teacher Slapped Student 35 Times : హోంవర్క్​ చేయలేదని బాలికపై టీచర్ దారుణం.. 35సార్లు.. - హోంవర్క్​ చేయలేదని 4 ఏళ్ల బాలికపై టీచర్ దాడి

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 6:26 PM IST

Teacher Slapped Student 35 Times :గుజరాత్​లోని సూరత్​ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు నాలుగేళ్ల విద్యార్థిని పట్ల అత్యంత పైశాచికంగా ప్రవర్తించింది. హోంవర్క్​ సరిగ్గా చేయలేదనే కారణంతో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 35 సార్లు ఆ చిన్నారిని వీపు కమిలేలా కొట్టింది. ఈ దృశ్యాలన్నీ తరగతి గదిలో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సూరత్‌లోని పునాగం ప్రాంతంలో ఉన్న సాధన నికేతన్​ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే స్కూల్​ నుంచి వచ్చిన తమ చిన్నారికి యూనిఫాం మారుస్తున్న సమయంలో ఆమె వీపుపై టీచర్​ దెబ్బలు కొట్టినట్లు గుర్తించానని బాలిక తల్లి తెలిపింది. ఇదే విషయమై పాఠశాలకు వెళ్లి టీచర్​ను నిలదీయగా కేవలం ఒక్కటే దెబ్బ కొట్టానని ఆమె బుకాయించినట్లు బాలిక తండ్రి చెప్పారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన బాధిత బాలిక తల్లిదండ్రులు క్లాస్​రూంలోని సీసీటీవీ దృశ్యాలను బయట పెట్టాల్సిందిగా డిమాండ్​ చేశారు. ఈ ఫుటేజీలో టీచర్​ చిన్నారిని 35 సార్లు కొట్టినట్లుగా స్పష్టంగా కనిపించింది. దీంతో సంబంధిత టీచర్​ను విధుల నుంచి తొలగించింది పాఠశాల యాజమాన్యం.

ABOUT THE AUTHOR

...view details