ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన చంద్రబాబు.. పాల్గొన్న ఎన్టీఆర్ కుమారులు - తెలంగాణ తాజా వార్తలు
Chandrababu at NTR Ghat: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణ, బాల కృష్ణ ఉన్నారు. వీరితో పాటుగా దేశం నేతలు మాగంటి బాబు, కంభంపాటి రామ్మోహన్ రావు, చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రావు, ఇతర నాయకులు ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా ఆయన నాంపల్లిలోని ఎగ్జిబేషన్ గ్రౌండ్లో టీడీపీ 42వ ఆవిర్భావ సభకు హాజరయ్యారు. టీడీపీ ఏర్పడి 41 వసంతాలు పూర్తి చేసుకొని 42వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇవాళ భారీ సభకు ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది పార్టీ ప్రతినిధులు వచ్చేలా ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజక వర్గ ఇంఛార్జీలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా ఈ సభకు హాజరయ్యారు.