TDP Leaders Protest in Telangana : ఏపీలో చంద్రబాబు అరెస్ట్.. తెలంగాణలో భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు - Tdp Telangana Leaders Slogans Against cm Jagan
Published : Sep 9, 2023, 4:37 PM IST
TDP Leaders Protest in Telangana Against Chandrababu Arrest : తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఏపీ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ.. తెలంగాణ టీడీపీ నేతలు(Telangana TDP Leaders) పలుచోట్ల ఆందోళనలకు దిగారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద పార్టీ నాయకుడు బక్క నర్సింహులు ఆధ్వర్యంలో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని దోమలగూడ టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర ఏపీ సీఎంపై వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కూకట్‌పల్లి జేఎన్టీయూ కూడలి వద్ద పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Chandrababu Arrest Respond Telangana Leaders : రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ భద్రాచలంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఆ పార్టీ శ్రేణులు ఆందోళలు చేపట్టారు. బేషరతుగా టీడీపీ అధినేతను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్‌లో నిరసన చేపట్టిన కార్యకర్తలు ఓటమి భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల అంబేడ్కర్ కూడలిలో కార్యకర్తలు కళ్లకు నల్ల రిబ్బను కట్టుకుని నిరసన తెలిపారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.