TDP Leaders March to Protest Chandrababu Arrest : రామయ్య సన్నిధిలో చంద్రన్న విడుదల కోసం ప్రత్యేక పూజలు.. - తెలంగాణ తాజా వార్తలు
Published : Sep 29, 2023, 7:46 PM IST
TDP Leaders March to Protest Chandrababu Arrest : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలతో సహా బాబు అభిమానులు భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేతను వెంటనే విడుదల అవ్వాలని కోరుతూ భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లాలోని నల్లజర్ల మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉమ్మడిగా 75 మంది సభ్యులు.. గత 5 రోజుల నుంచి మహా పాదయాత్ర చేసి భద్రాచలం చేరుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం చేరుకొని చంద్రబాబు నాయుడును తొందరగా విడుదల చేయాలని శ్రీరామచంద్రమూర్తిని వేడుకున్నారు. భద్రాచలం పార్టీ తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి స్వాగతం పలికి వారితో పాటు పూజల్లో పాల్గొన్నారు.