TDP Leader Dulipalla Narendra on Skill Develpment Case : 2021 కేసులో ఇప్పటివరకు ఛార్టిషీట్ ఎందుకు వేయలేదు ? : దూళిపాళ్ల నరేంద్ర - Dulipalla Narendra Harsh comments on YSRCP
Published : Sep 9, 2023, 5:28 PM IST
TDP Leader Dulipalla Narendra Counter to AP CID: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌పై ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాన్ని అణిచివేసే ధోరణిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు), ప్రస్తుత ప్రభుత్వాలు అభినందించిన విషయాన్ని దూళిపాళ్ల గుర్తు చేశారు. ఎలాంటి అవినీతి లేనందునే ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత 20 నెలలుగా ఛార్జిషీట్ నమోదు చేయలేదని పేర్కొన్నారు.
Dulipalla Narendra Comments: ''స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పని చేసిన అధికారులపై కేసులెందుకు పెట్టలేదు..?, 2021లో కేసు రిజిస్టర్ చేస్తే.. ఇప్పటివరకూ ఎందుకు ఛార్టిషీట్ వేయలేదు..?, చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి విచారణ అధికారి కాకుండా, డీఐజీ స్థాయి అధికారి రావడానికి గల కారణమేంటి..?, స్కిల్ డెవలప్‌మెంట్‌ను హైకోర్టు, ప్రస్తుత ప్రభుత్వాలు అభినందించాయి. ఎలాంటి అవినీతి లేనందునే 20 నెలలుగా ఛార్జిషీట్ నమోదు చేయలేదు. సీఐడీ ఛీఫ్ సంజయ్ చెప్పిన ప్రకారం.. ఒకవేళ నిధులు విడుదల చేయడం తప్పైతే.. అధికారుల పేర్లను ఎందుకు కేసులో పెట్టలేదు..?. చంద్రబాబును ఇరికించాలి కాబట్టే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల దుర్వినియోగం జరగలేదని వివిధ సందర్భాల్లో హైకోర్టు చెప్పింది.'' అని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు.