ETV Bharat Telangana

తెలంగాణ

telangana

video thumbnail
ఏఐ యాంకర్​ వైభవిని పరిచయం చేసిన టీడీపీ

ETV Bharat / videos

TDP Introduce AI Anchor Vaibhavi: టీడీపీ కొత్త ప్రయోగం.. ఏఐ యాంకర్​ వైభవితో యువగళంషెడ్యూల్​ - Artificial intelligence Anchor Vaibhavi

author img

By

Published : Jul 19, 2023, 5:20 PM IST

AI Anchor Vaibhavi Read Yuvagalam Schedule : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో టీడీపీ నాయకులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్​తో వార్తలు చదివేలా టీడీపీ సాఫ్ట్‌వేర్‌ డిజైన్ చేసింది. ఈ ప్రయోగం ద్వారా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్​ చేపట్టిన యువగళం షెడ్యూల్​ను వివరించింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 159వ రోజు జరిగే కార్యక్రమాలను కృత్రిమ యాంకర్ వైభవి వార్తలు చదివింది. ఇక నుంచి యువగళం అప్​డేట్స్ ఇచ్చేలా కృత్రిమ యాంకర్​ వైభవితో వార్తలు చదివించి.. అనంతరం వీడియోలు విడుదల చేయనున్నారు. టీడీపీ అనుబంధ విభాగం ఐ-టీడీపీ ద్వారా  ద్వారా నూతన విధానానికి రూపకల్పన చేసినట్లు టీడీపీ నాయకులు వివరించారు. ఏఐ టెక్నాలజీ ద్వారా పార్టీ కార్యక్రమాలపై ప్రచారం సాగించే ఆలోచనలో టీడీపీ ఉంది. మేనిఫెస్టో సహా పార్టీ కార్యక్రమాలు, అప్​డేట్స్ ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల చరిత్రలో తొలి ఏఐ యాంకర్ ఆలోచన తమదేనని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 

ABOUT THE AUTHOR

author-img

...view details