తెలంగాణ

telangana

TDP_Calls_to_People_to_Motha_Mogiddham_Programme

ETV Bharat / videos

TDP Calls to People to Motha Mogiddham Programme: ప్యాలెస్​లో ఉన్న సైకోకి వినపడేలా 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి టీడీపీ పిలుపు - AP Latest News

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 8:21 AM IST

TDP Calls to People to Motha Mogiddham Programme: నియంత ముందు మొర పెట్టుకుంటే సరిపోదు రాష్ట్రమంతటా మోత మోగించాలని(Motha Mogiddham) తెలుగుదేశం నిర్ణయించింది. చంద్రబాబుకు మద్దతుగా ఈ రోజు రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు ఏదో ఒక రకంగా శబ్ధం చేసి చంద్రబాబుకు మద్దతు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చింది. 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో ప్యాలస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినబడేలా నిరసన తెలపాలని కోరింది. మరోవైపు ఇవాళ నంద్యాలలో తెలుగుదేశం రాజకీయ కార్యాచరణ కమిటీ సమావేశం కానుంది. రానున్న రోజుల్లో జనసేనతో కలసి మరిన్ని విభిన్న నిరసన కార్యక్రమాలు చేపట్టేలా కార్యచరణ సిద్ధం చేయనుంది.

ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా జరిపే నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు మద్దతు తెలపాలని తెలుగుదేశం కోరింది. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు 5 కోట్ల మంది చేతులు కలిసేలా మోత మోగిద్దాం అంటూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ సమయంలో ప్రజలు ఇంట్లో, రోడ్డుపై, కార్యాలయంలో, పని ప్రదేశంలో ఎక్కడ ఉంటే అక్కడే కంచాలు మోగించడం, గంట కొట్టడం, విజిల్స్ వేయడం, వాహనాల హారన్లు మోగించడం ద్వారా చంద్రబాబుకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుందని తెలుగుదేశం గుర్తుచేసింది. సైకో ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదని అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేననని ప్రజలకు పిలుపునిచ్చింది.

చంద్రబాబుని నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసిన చోటే నేడు తెలుగుదేశం రాజకీయ కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్, ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల నేపథ్యంలో చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై భేటీలో చర్చించనున్నారు. పీఏసీ(PAC) ఏర్పాటైన తర్వాత జరగనున్న రెండో సమావేశం ఇది. లోకేష్‌ దిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో సమావేశంలో పాల్గొంటారు. అక్టోబరు 2 నుంచి నిరసనలు ఉద్ధృతం చేయడంతో పాటు... తెలుగుదేశం, జనసేనతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details