TDP Cadre Protest in AP: చంద్రన్న అరెస్ట్‌కు నిరసనగా కదిలిన ఆంధ్రప్రదేశ్ - ఏపీ టీడీపీ న్యూస్
Published : Sep 13, 2023, 8:32 PM IST
TDP cadre stages protest in AP: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు... రగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పలుచోట్ల పోలీసులు దీక్షలను భగ్నం చేసి... శ్రేణులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి... స్టేషన్లకు తరలించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా... నిర్బంధాలు చేసినా... తమ అధినేతను విడుదల చేసేవరకు తగ్గేదే లేదంటూ కార్యకర్తలు దీక్షలు నిర్వహించారు. పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ శ్రేణులు చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసన దీక్షకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను సైతం ముందస్తు అరెస్ట్‌లు చేయడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుుల వైసీపీ ప్రభుత్వానికి అనుకులంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. పలు చోట్లు టీడీపీ శ్రేణులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మద్ధతు తెలిపారు.