షాకింగ్ వీడియో.. మహిళ మీద నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్.. అక్కడికక్కడే.. - వాటర్ ట్యాంకర్ ఢీకొట్టి మహిళ మృతి
కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను వెనుకనుంచి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. అనంతరం ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నగరంలోని లగ్గరె బస్టాండ్ సమీపంలో జరిగింది. మృతురాలిని ఆశ అనే మహిళగా గుర్తించారు. ఆమె కిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుందని, ఇంటికి వెళ్లే సమయంలో ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఫోన్ చూసుకుంటూ డ్రైవర్ వాహనం నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఘటన తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఈ ఘటనపై రాజాజీ నగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST