బాలయ్య డైలాగ్స్‌తో అదరగొట్టిన తమిళ డైరెక్టర్ - the warrior movie director Lingusamy
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'ది వారియర్'. తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ సినిమాకు దర్శకుడు. లింగుసామి డైరెక్ట్‌గా తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా జులై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. అనంతరపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హాజరైన ఈ కార్యక్రమంలో బాలయ్య డైలాగ్స్‌తో అదరగొట్టారు లింగుసామి. 'ప్లేస్ మారితే.. తినే ఫుడ్డు మారుతుంది.. పడుకునే బెడ్డు మారుతుంది.. బ్లడ్ ఎందుకు మారుతుందిరా బ్లడీఫూల్'.. లాంటి డైలాగ్స్ ఫ్యాన్స్‌ను హుషారెత్తించారు. అంతేకాకుండా తాను ఇక్కడ ఉండిపోతాను అని.. తమిళనాడుకు వెళ్లనని చెప్పుకొచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST