Talwar Aarti In Harsiddhi Mata Temple : 423ఏళ్ల ఆలయంలో 175 కత్తులతో మహా హారతి.. నవరాత్రి ఉత్సవాల్లో వినూత్నంగా.. - నవరాత్రుల్లో అమ్మవారికి కత్తుల హారతి
Published : Oct 21, 2023, 3:52 PM IST
|Updated : Oct 21, 2023, 6:42 PM IST
Talwar Aarti In Harsiddhi Mata Temple :నవరాత్రుల్లో అమ్మవారిని రకరకాల పద్ధతుల్లో కొలుస్తారు భక్తులు. అయితే గుజరాత్.. నర్మద జిల్లాలోని రాజ్‌పిప్లా పట్టణంలో వినూత్న పూజలు చేశారు భక్తులు. పట్టణంలో ఉన్న హర్‌సిద్ధీ మాత ఆలయంలో ఖడ్గాలతో అమ్మవారికి హారతి సమర్పించారు.
9 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం..
రాజ్‌పిప్లా పట్టణంలోని 423 ఏళ్ల చరిత్రగల హర్‌సిద్ధిమాత ఆలయం ఉంది. ఈ హర్‌సిద్ధిమాత రాజ్‌పుత్‌ల కులదేవతగా ప్రసిద్ధి చెందింది. నవరాత్రి వేళలో హర్సిద్ధి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. అందులో భాగంగా వినూత్నంగా కత్తులతో హరతి ఇవ్వడం ప్రారంభించారు. 9 ఏళ్లుగా ఇలా ఖడ్గాలతో హారతి ఇస్తున్నారు. ఈసారి కూడా ఖడ్గ హారతి ఏర్పాటు చేశారు. గుడి ముందు భాగంలో పూలతో విల్లు, బాణం ముగ్గు వేశారు. దాని మధ్యలో తెల్లటి పైజామా, కాషాయ తలపాగా ధరించిన దాదాపు 175 మంది యువకులు కూర్చుని.. హర్సిద్ధి మాతకు మహా హారతి సమర్పించారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాల మద్య దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. యువకులు కత్తులు తిప్పుతూ హారతి ఇస్తున్నప్పుడు వారిపై పూల వర్షం కురిపించారు నిర్వాహకులు.