తెలంగాణ

telangana

ETV Bharat / videos

లంబోర్గినిగా మారిన మారుతీ స్విఫ్ట్ సీఎంకు మెకానిక్ కానుక - లంబోర్గిని కారు

By

Published : Dec 3, 2022, 11:32 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

అసోం కరీంగంజ్​కు చెందిన నూరుల్ హక్ మారుతీ స్విఫ్ట్ కారును లంబోర్గినిగా మార్చేశాడు. విలాసవంతమైన లంబోర్గిని కారును తలపించేలా పది లక్షల రూపాయలతో పాత కారుకు మార్పులు చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. జిల్లాలోని భాంగా ప్రాంతంలో మెకానిక్​గా పనిచేస్తున్నాడు నూరుల్. స్పోర్ట్స్ కార్లపై మక్కువతోనే పాత కారును లంబోర్గినిగా మార్చినట్లు తెలిపాడు. ఈ కారు తయారీకి నాలుగు నెలల సమయం పట్టిందని చెప్పాడు. ఈ కారును ఓ ప్రదర్శనలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిలకించారు. దీన్ని ఆయనకే గిఫ్ట్​గా ఇస్తానని నూరుల్ చెబుతున్నాడు. త్వరలో మరో పాత కారును ఫెరారీలా మార్చనున్నట్లు చెప్పాడు. ప్రభుత్వం సహకరిస్తే ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు చేపడతానని అంటున్నాడు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details