అర్ధరాత్రి దొంగల హల్‌చల్ - పలు దుకాణాల్లో నగదుతో పాటు సరుకులు చోరీ - సూర్యపేటలో వరుస దొంగతనాలు
Published : Dec 23, 2023, 3:59 PM IST
Suryapet Thefts 2023 : సూర్యాపేట జిల్లా పరిధిలో రోజురోజుకూ నేరాల సంఖ్య పెరుగుతుంది. జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో నిన్న ఒక్కరోజే వేర్వేరు కిరాణ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. మండల కేంద్రంలో పలు దుకాణాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. మొబైల్ షాపులో 60 వేల నగదును ఎత్తుకెళ్లారు. వైన్‌షాపు దగ్గర ఫుడ్ కౌంటర్‌లో ఉన్న నగదు, పలు కిరాణా షాపుల్లో సరకులతో పాటు నగదును, ఏ టు జడ్ దుకాణ వ్యాపారి ద్విచక్ర వాహనాన్ని అపహరించుకుపోయారు.
Theft cases in Telangana: దొంగలు చోరీకి పాల్పడిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తుతో అప్రమత్తంగా ఉన్నప్పటికీ చోరులు వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజలు ఊర్లకి వెళ్లేటప్పుడు బంగారం, నగదును బ్యాంకు లాకర్లో దాచుకొని వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.