మిమిక్రీ చేస్తున్న పక్షి భారత్‌లో ప్రత్యక్షమైన ఆస్ట్రేలియన్ బర్డ్ - మహారాష్ట్ర లయర్బర్డ్ న్యూస్
మహారాష్ట్రలోని మెల్ఘాట్ అటవీ ప్రాంతంలో అరుదైన ఆస్ట్రేలియన్ పక్షి దర్శనమిచ్చింది. ఈ లైర్ జాతి పక్షి భారత్‌లో కనిపించడంపై పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలో ఎక్కడా లైర్ పక్షి జాడలు కనిపించవని తెలిపారు. అలాంటి పక్షి ఇక్కడ కనిపించడం వింతగా అనిపిస్తోందని ఆర్నితాలజిస్ట్‌లు అంటున్నారు. మిమిక్రీ చేయడం దీని ప్రత్యేకత అని వారు తెలిపారు. దీనికి ఏదైనా శబ్ధం వినిపిస్తే అదే విధంగా పలుకుతుందని వివరించారు. భారత్‌కు అది ఎలా వచ్చిందనే అంశంపై పరిశోధన చేస్తామని వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST