తెలంగాణ

telangana

Sunflower like diamond ring worth Rs 6 crore 44 lakh made in Surat named in Guinness Book of World Records

ETV Bharat / videos

50వేల వజ్రాలతో ఉంగరం.. గిన్నిస్​ బుక్​లో చోటు.. పర్యావరణం కోసమేనట! - వజ్రాల ఉంగరం సూరత్​ ధర

By

Published : Apr 19, 2023, 10:50 AM IST

ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని గుజరాత్​లోని సూరత్​కు చెందిన ఓ జ్యువెలరీ సంస్థ తయారు చేసింది. ఈ ప్రత్యేకమైన ఉంగరం గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది. చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ ఉంగరం తయారు చేయడానికి కారణమేంటో తెలుసా?

సూరత్​కు చెందిన హరికృష్ణ ఎక్స్​పోర్ట్స్ అనే ఓ సంస్థ.. 50,907 వజ్రాలతో ఉంగరాన్ని రూపొందించింది. రీసైకిల్ చేసిన బంగారాన్ని ఉపయోగించి పొద్దుతిరుగుడు పువ్వు ఆకారంలో రింగ్​ను తయారు చేసింది. రూ.6.44 కోట్ల విలువైన ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు 460.55 గ్రాముల బంగారాన్ని ఉపయోగించింది. ఈ ప్రత్యేకమైన ఉంగరం.. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు కూడా దక్కించుకుంది.

"ఈ ప్రత్యేకమైన ఉంగరాన్ని తయారు చేసేందుకు తొమ్మిది నెలల సమయం పట్టింది. పూర్తిగా రీసైకిల్​ చేసిన బంగారాన్ని మాత్రమే ఉపయోగించాం. తయారు చేసేటప్పుడు ఎనిమిది భాగాలుగా వేరు చేసి రూపొందించాం. సన్​ఫ్లవర్​పై సీతాకోక చిలుక వాలినట్లుగా ఉంగరాన్ని తయారు చేశాం. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ డైమిండ్​ రింగ్​ను రూపొందించాం. త్వరలోనే 50,907 చెట్లను నాటుతాం."
-ఘనశ్యాంభాయ్ ధోలాకియా, హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్

కొద్దిరోజుల క్రితం.. ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​కు చెందిన ఓ సంస్థ కూడా ప్రత్యేకమైన వజ్రాల ఉంగరాన్ని రూపొందించింది. అందుకు 26,200 డైమండ్లను ఉపయోగించింది. మొదట ఆ ఉంగరం డిజైన్​ను సాఫ్ట్​వేర్​ ద్వారా రూపొందించామని.. ఆ తర్వాత కళాకారులతో మూడు నెలల పాట రింగ్​ను తయారు చేయించినట్లు మేనేజింగ్​ డైరెక్టర్​ విపుల్​ వివరించారు. ఆ స్పెషల్​ డైమండ్​ రింగ్​ను చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details