వరంగల్ నిట్‌లో 'స్ప్రింగ్ స్ప్రీ' వేడుకలు.. ఆకట్టుకున్న సుమ 'టాక్ షో' - Anchor Suma at waranagal NIT
Anchor Suma at waranagal NIT : వరంగల్ నిట్‌లో స్ప్రింగ్ స్ప్రీ 2023 సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. నిట్‌తోపాటు వివిధ కళాశాలలకు చెందిన 8 వేలకు పైగా విద్యార్ధులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. మెదడుకు పదను పెట్టే విధంగా పలు ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. చిత్రలేఖనం విభాగంలో సీడీలపై చక్కటి చిత్రాలు గీయడం, ఆరోగ్యాన్నిపెంపొందించే విధంగా దేహధారుడ్యాన్ని పెంచుకోవాల్సిన ఆవశ్యతను తెలియజేయడం, పలు సినిమాల సన్నివేశాలను చూసి వేరేగా జరిగితే ఎలా ఉంటుందో ఊహించి చెప్పడం, బుడగలు గురి చూసి పగులగొట్టడం, ఇంకా మట్టితో పాత్రలు తయారుచేయడం మొదలైన ఈవెంట్లలో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మ్యూజిక్ కళాధ్వని పేరుతో జరిగే ఈ వేడుకల్లో ఈసారి పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు. ఒత్తిడి తగ్గిస్తూ మానసికోల్లాసం కలిగిస్తోందని విద్యార్ధులు చెబుతున్నారు.
ఇక ప్రముఖ వ్యాఖ్యాత నటి.. సుమ రాక ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆడిటోరియంలో జరిగిన టాక్ విత్ సుమ కనకాల, ఆద్యంతం సరదాగా సాగింది. సుమ నటించిన ఈటీవీ షోస్‌ను ఏవీగా ప్రదర్శించారు. ఆడి పాడి అందరినీ అలరించారు. స్పాట్ ఈ సందర్భంగా సుమ.. వ్యాఖ్యాతగా, నటిగా తన ప్రయాణం గురించి విద్యార్ధులకు వివరించారు. మనం ఒకే వయస్సు వాళ్లం అని చెప్పి నవ్వులు పూయించారు. ఈటీవీ స్టార్ మహిళ సుదీర్ఘకాలం జరిగిన లేడీస్ 'షో'గా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇష్టమైన దాంట్లో శ్రద్దపెట్టి రాణిస్తే తిరుగే ఉండదని విద్యార్ధులకు ఉద్భోదించారు.