మారిన సిలబస్‌తో తలపోటు పదో తరగతి విద్యార్థులు ఒత్తిడి జయించడం ఎలా - తెలంగాణ తాజా వార్తలు
PRATHIDHWANI పది పరీక్ష దాటేదెలా. ఇటు విద్యార్థులే కాదు అటు ఉపాధ్యాయుల్లోనూ ఇదే మథనం ఇప్పుడు. మారిన పరీక్షల తీరు, సిలబస్‌తో విద్యార్థులు, అధికారులు విధిస్తున్న ఉత్తీర్ణత లక్ష్యాలతో ఉపాధ్యాయులలో నెలకొన్న తీవ్ర ఒత్తిళ్లే దీనికి కారణం. మరి ఎంతో కీలకమైన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం పేపర్ల సంఖ్య 11 నుంచి 6కి తగ్గించినా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలకు కారణం ఏమిటి. ఉత్తీర్ణత శాతాలపై హామీలకు సంబంధించి ఉపాధ్యాయవర్గాల్లో కలవరపాటు ఎందుకు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.