తెలంగాణ

telangana

Students Protest at Srinidhi University

ETV Bharat / videos

Students Protest at Srinidhi University : అనుమతులు లేకుండానే క్లాసులా...? శ్రీనిధి యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన - Students Protest at Srinidhi University

By

Published : Aug 16, 2023, 4:49 PM IST

Updated : Aug 16, 2023, 4:57 PM IST

Students Protest at Ghatkesar Srinidhi University : హైదరాబాద్ శివారు ఘట్​కేసర్ మండలంలోని శ్రీనిధి విశ్వవిద్యాలయం (Srinidhi University) వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వర్సిటీకి అనుమతి రాకముందే తప్పుడు సమాచారం ఇచ్చి సుమారు 290 మంది విద్యార్థులను చేర్చుకుని తరగతులు నిర్వహిస్తున్నారన్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇటీవల పలుమార్లు విద్యార్థి సంఘాలు ఈ విషయమై ఆందోళన చేసినా.. అనుమతి వస్తుందని యాజమాన్యం చెబుతూ వచ్చిందన్నారు. గత నెల 31న తల్లిదండ్రులు, విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేయడంతో... వర్సిటీ కార్యదర్శి కేటీ మహి తల్లిదండ్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులను శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలోకి (Srinidhi Engineering College) తీసుకుంటామని, అందుకు ఆగస్టు 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులను కోరారు. తాజాగా గడువు అయిపోయినా విద్యార్థులను కళాశాలలోకి బదిలీ చేయకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వర్సిటీకి వస్తున్న ఎన్​ఎస్​యూఐ (NSUI) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను మేడిపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Aug 16, 2023, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details