Students Cry Over Principal's Transfer Sangareddy : టీచర్ బదిలీతో విద్యార్థుల కంటతడి.. పాఠశాల వదిలి వెళ్లద్దంటూ అడ్డుపడ్డ విద్యార్థులు - సంగారెడ్డిలో సార్ బదిలీపై విద్యార్థుల ఆవేదన
Published : Sep 23, 2023, 1:31 PM IST
Students Cry Over Principal's Transfer Sangareddy :మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ అన్నట్లు మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. ఈ మాటలకు తగ్గట్లే గురువులు పిల్లలకు బాధ్యతతో మంచి నడవడికను, చదువును నేర్పుతారు. టీచర్లు విద్యార్థులకు మంచి విషయాలు, క్రమశిక్షణ అలవరిచి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా తోడ్పడతారు. అందుకు తగ్గట్లే విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల పట్ల అంతులేని ప్రేమాభిమానాలను పెంచుకుంటారు. ఇలా ఓ టీచర్‌పై ఎంతో మమకారం పెంచుకున్న పిల్లలు ఆయన బదిలీపై వెళ్తుంటే కంటతండి పెట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పని చేసిన భాస్కర్ ఇటీవల వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం ఆయన పాఠశాలను వీడి వెళ్తున్న నేపథ్యంలో విద్యార్థులు కన్నీరు మున్నీరై విలపించారు. విద్యార్థులందరూ భాస్కర్ దగ్గరకు వచ్చి వెళ్లద్దంటూ కంటతడి పెట్టారు. పిల్లలను చూసి ఆయనతో పాటు తోటి ఉపాధ్యాయులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు.