తెలంగాణ

telangana

Students climb JCB to go to school

ETV Bharat / videos

'బస్సు వేసేదెప్పుడో.. కష్టాలు తీరేదెప్పుడో?'.. JCBలో స్కూల్​కు విద్యార్థులు! - జేసీబీలో పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు

By

Published : Jun 21, 2023, 12:39 PM IST

కొందరు పిల్లలు పాఠశాలకు ఆటోలో వెళ్తారు. మరికొందరు స్కూల్​ బస్సులో వెళ్తుంటారు. కానీ, కర్ణాటక​కు చెందిన విద్యార్థులు మాత్రం జేసీబీలో వెళ్తున్నారు. స్కూల్​కు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ఇలా వెళ్తున్నామని విద్యార్థులు వాపోయారు. ఈ ఘటన కర్ణాటక కొప్పాళలో జరిగింది.

ఇదీ జరిగింది
కుష్టాగి తాలుకాలోని శాఖపురా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. దీంతో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరేరాలిహల్లిలోని పాఠశాలకు రోజూ నడిచి వెళ్తున్నారు విద్యార్థులు. రోజూలాగే మంగళవారం స్కూల్​కు నడిచి వెళ్తుండగా.. వీరిని గమనించిన జేసీబీ డ్రైవర్​ లిఫ్ట్ ఇచ్చారు. విద్యార్థులను జేసీబీలో ఎక్కించుకుని స్కూల్​ వద్ద దింపారు. దీనిని చూసిన గ్రామస్థులు.. జేసీబీలో వెళ్తున్న విద్యార్థులను వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి పథకాలు పెట్టే బదులు.. విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇకనైనా కల్యాణ కర్ణాటక రోడ్​ ట్రాన్స్​పోర్టేషన్.. తమకు బస్సు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ బాలుడు.. గుర్రంపై పాఠశాలకు వెళ్తున్నాడు. ఎందుకో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details