మధ్యాహ్న భోజనం వికటించి 16 మంది విద్యార్థులకు అస్వస్థత - నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ లెటెస్ట్ న్యూస్
Published : Dec 8, 2023, 3:33 PM IST
Students Affected To Food Poison At Nizamabad :మధ్యాహ్న భోజనం వికటించి 16 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిజామాబాద్ శివారులోని బోర్గాం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి, నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్న రెండు గంటల తరువాత కడుపు నొప్పితో బాధపడ్డారని ఉపాధ్యాయులు తెలిపారు. వెంటనే ఉపాధ్యాయులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
Nizamabad MLA Suryanarayana Gupta Visited Students : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఓకే ఏజెన్సీ పుడ్ నిర్వాహణ చూస్తోంది. అదే ఏజెన్సీ అధ్వర్యంలో పుడ్ పాయిజన్ జరగడం ఇది రెండోసారి అని, కలెకర్ట్ ఇప్పటికి విద్యార్థులను పరామర్శించకపోవడం ఆశ్చర్యకరమని ధన్ పాల్ అన్నారు. కలెక్టర్కు మెమోరాండం ఇస్తామని ఎమ్మెల్యే సూర్యనారాయణ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే డీఈఓను కోరారు.