School Student Accident in Shadnagar : స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న విద్యార్థిని ఢీకొన్న బైక్ - student road accident in ramgareddy
Student Road Accident in Shadnagar : అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు తీయటం నిత్యకృత్యంగా మారింది. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకున్న ప్రజల్లో చలనం లేకుండా పోతోంది. హైదరాబాద్ పరిసరాల్లో నిన్న ఒక్కరోజే ఏడుగురు బలవ్వగా.. అదే తరహాలో రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్ మల్లికార్జున కాలనీలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని.. ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టింది. శ్రీ సరస్వతి శిశు మందీర్ ఎదుట నుంచి విద్యార్థులు సాయంత్రం ఇంటికి వెళ్తున్నారు. ఇదే సమయంలో ద్విచక్రవాహనంపై దూసుకొచ్చిన కొందరు ఆకతాయిలు.. రోడ్డుపై నుంచి వెళ్తున్న ఓ విద్యార్థిని ఢీకొట్టారు. తీవ్రగాయాలపాలై చిన్నారి ప్రాణాలు కొట్టుమిట్టాడుతుండగా.. ప్రమాదానికి కారణమైన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. గండం తప్పింది. లెక్కలేనితనంతో వాహనాలు నడుపుతున్నా.. పోలీసుల నియంత్రణ లేని కారణంగానే ఇలాంటి ధోరణి పెరిగిపోతోందని ప్రజలు వాపోతున్నారు.