తెలంగాణ

telangana

Street Dog Attack On Tourist In Agra Viral Video

ETV Bharat / videos

తాజ్​మహల్​ గేట్ వద్ద టూరిస్ట్​పై వీధికుక్క దాడి- కాలిపై గాట్లు, వీడియో వైరల్​ - dog attack on man in tajmahal video viral

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 4:26 PM IST

Street Dog Attack On Tourist In Agra Viral Video : ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాలో ఉన్నతాజ్​మహల్ గేట్ బయట కర్ణాటకకు చెందిన పర్యటకుడిని ఓ కుక్క కరిచిన ఘటన కలకలం రేపింది. తోటి పర్యటకులతో కలిసి ఫ్యామిలీ రెస్టారెంట్​కు వెళ్తుండగా ఓ కుక్క షేను అనే వ్యక్తిని కరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఇదీ జరిగింది
ఆగ్రాను సందర్శించడానికి కర్ణాటక నుంచి కొందరు పర్యటకులు వెళ్లారు. తాజ్​మహాల్ బయట గేట్​ సమీపంలోని ఓ రెస్టారెంట్​కు వారంతా వెళుతున్నారు. ఈ క్రమంలో షేను అనే పర్యటకుడిపై ఓ శునకం దాడిచేసి అతని కాలిపై కరిచింది. దీంతో అతను వీధికుక్కను తరిమికొట్టాడు. కానీ కుక్క షేను కాలును విడవలేదు. శునకం నుంచి విడిపించుకునే క్రమంలో ఒక్కసారిగా అతను నేలపై పడిపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో పర్యటకుడు గట్టిగా అరిచాడు. అతడి అరుపులు విన్న తోటి పర్యటకులు ఆ శునకాన్ని తరిమారు. ఈ క్రమంలో వీధి కుక్కలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పర్యటకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details