తెలంగాణ

telangana

Street Dog Attack Boy in Nizamabad

ETV Bharat / videos

Street Dog Attack on Boy in Nizamabad : బాలుడిపై వీధి కుక్క దాడి.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - Nizamabad District News

By

Published : Aug 14, 2023, 2:30 PM IST

Street Dog Attack on Boy in Nizamabad : రాష్ట్రంలో చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. పిల్లలు ఇంట్లో నుంచి బయటకు ఒంటరిగా రావాలంటే జంకుతున్నారు. తాజాగా ఆరు బయట ఆడుకుంటున్న బాలుడిని.. వీధి కుక్క దాడి చేసి గాయపరిచిన ఘటన నిజామాబాద్​ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. నగరంలోని సాయినగర్-2లో ఆడుకుంటున్న బాలుడిపై.. ఒక్కసారిగా వీధి కుక్క దాడి చేసింది. బాలుడు భయంతో బిగ్గరగా అరవడంతో.. అక్కడ ఉన్న స్థానికులు కుక్కను తరిమేశారు. బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాలుడిపై కుక్క దాడి చేసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నగరవ్యాప్తంగా వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరిగిపోతోందని.. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి.. వీధి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details