Video : బాలికపై వీధికుక్కల దాడి.. ఒకేసారి గుంపుగా వెంటాడి, చుట్టుముట్టి.. - వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలిక కేరళ
Stray Dogs Kerala : 9 ఏళ్ల బాలికపై వీధికుక్కలు భీకరంగా దాడి చేశాయి. వెంటపడి.. చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచాయి. బాలిక కేకలు విన్న కుటుంబ సభ్యులు రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కేరళలో జరిగింది.
ఇదీ జరిగింది.. కన్నూరు జిల్లా ఎడక్కడ్ మండలం ముజుపిలంగఢ్ గ్రామానికి చెందిన మూడో తరగతి బాలిక (9 ఏళ్లు).. సోమవారం బయటకు వెళ్లింది. సాయంత్రం ఎడక్కడ్ రైల్వే స్టేషన్ వెనుక ఉన్న తన ఇంట్లోకి వెళ్లేందుకు గేటు తెరించింది. ఇంతలో ఆమెను వీధికుక్కలు వెంబడించాయి. అనంతరం చుట్టుముట్టి భీకరంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలిక కింద పడి కేకలు వేసింది. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు కాపాడి.. కన్నూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
వీధికుక్కల దాడి.. రక్తపుమడుగులో చిన్నారి..
దేశవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరుతున్నాయి. ఏప్రిల్‌లో తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీకి చెందిన ఓ బాలికపై కూడా వీధికుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలిక తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు బాలిక కేకలు విని.. రక్తపుమడుగులో పడి ఉన్న చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ వీధికుక్కల దాడి సీసీటీవీలో రికార్డయ్యింది. ఆ వీడియా చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.