ఎద్దులు హల్చల్.. ఘర్షణ పడి బైక్‌ను ఢీ.. దూసుకొచ్చిన కారు.. - bull hits bike in barnala
bull hits biker: పంజాబ్ బర్నాలా నగరంలో రహదారిపై పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. తాజాగా హందియాయా రహదారిపై రెండు ఎద్దులు ఘర్షణ పడి.. రోడ్డుపైకి దూసుకొచ్చాయి. దీంతో రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పశువులు ఢీకొట్టగానే బైక్‌తో సహా వెళ్లి పక్కనుంచి వెళ్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ఘటన సీసీటీవీలో నమోదైంది. తీవ్రగాయాలైన ద్విచక్ర వాహనదారుడిని బర్నాలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పటియాలా ఆస్పత్రికి బాధితుడిని తీసుకెళ్లారు.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST