భారీ వర్షంతో పవర్ కట్.. రోప్వేకు బ్రేక్.. గంటన్నరపాటు గాల్లోనే జనం! - మధ్యప్రదేశ్ రోప్‌వే ప్రమాదం
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అమ్మవారిని దర్శించుకోవటానికి కొండపైకి చేరేందుకు రోప్‌వే ఎక్కిన భక్తులు.. పవర్ కట్‌తో హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గంటన్నర పాటు గాలిలోనే ఉండిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ మైహర్‌లోని త్రికూట్ కొండపైకి వెళ్లే మార్గంలో జరిగింది. భీకర గాలులతో తుపాను విధ్వంసానికి భారీ వృక్షాలు నెలకొరగగా.. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటమే అందుకు కారణం. కొండపైన ఉన్న శారదా దేవి దర్శనానికి వెళ్తుండగా ఇలా జరిగింది. రోప్‌వే ఆగిపోయి గంటకుపైగా సమయం అవుతున్నా.. అక్కడే నిలిచిపోవటం వల్ల భక్తుల్లో ఆందోళన పెరిగిపోయింది. అయితే.. గంటన్నర తర్వాత విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించటం ద్వారా ఊపిరిపీల్చుకున్నారు. అత్యవసర సమయంలో విద్యుత్తు సరఫరాకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని అధికారులపై మండిపడ్డారు భక్తులు. భక్తులందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST