తెలంగాణ

telangana

Stones on stone

ETV Bharat / videos

ప్రకృతి పేర్చిన అందమైన బండరాళ్లు.. నిజంగా అద్భుతం - శంషాబాద్‌లో అద్భుతం

By

Published : Mar 23, 2023, 3:46 PM IST

ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చింది.. ఇస్తూనే ఉంది.. మనకు ఎన్నో విషయాలను సైతం నేర్పిస్తూనే ఉంటుంది. అయితే జీవరాశి మనుగడకు నిలయమైన ఈ భూమిపై ఏ వస్తువైనా అద్భుత సృష్టే. ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పురోగతి సాధించిన.. మేధావులకు సైతం అర్థం కాని ఎన్నో విషయాలు ఈ భూమండలం మీద ఉన్నాయి. వాటి గురించి ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్త కనుక్కోలేకపోయారు. అవి ఆరకంగా ఎలా రూపుదిద్దుకున్నాయో తెలియక సైంటిస్టులు సైతం తలలు పట్టుకుంటున్నారు. భూమి ఆవిర్భవించిన దగ్గర నుంచి నేటి వరకు అలాంటి ఎన్నో విషయాలకు ఎవరూ సమాధానమే చెప్పలేకపోయారు. అయితే అలాంటిదే హైదరాబాద్‌నగరం శంషాబాద్‌లోని హమీదుల్లానగర్‌లో ఉంది. ఒక రాయిపై మరోక రాయి పేర్చుతూ ఉండే ఆ రాయిని చూస్తే.. కడవపై కడవ పెట్టినట్లు చూపరులను ఆకట్టుకుంటుంది. అసలు ఇలా ఎలా ఆవిర్భవించిందనే ఆలోచన మనసులో తెలుస్తుంది. అయితే ఈ చక్కని ప్రకృతి పేర్చిన అందాల బండరాళ్లను చూడడానికి ఎంతో మంది సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారని స్థానికులు తెలుపుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details